Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఒకవైపు కరోనా వైరస్‌తో సతమతమవుతున్న ప్రజలకు సీజనల్ వ్యాధులు వెంటాడుతున్నాయి. కురుస్తున్న భారీ వర్షాలకు నీళ్లు నిల్వ ఉండడంతో దోమలు విజృంభిస్తుండడంతో విష జ్వరాల బారిని పడుతున్నారు. మున్సిపల్ కేంద్రంలో దోమలతో డెంగ్యూ , మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారిన పడి మంచాన పడుతున్నారు. జ్వరంతో దగ్గు, జలుబు వంటి నొప్పులు ఉండడం ఆ లక్షణాలన్నీ కరోనా వైరస్ లక్షణాలతో పోలి ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు .కరోణ వైరస్ పరీక్షలు ఇప్పటికీ రోజూ కనీసం 70 నుండి250 వరకు చేస్తున్నట్టు వైద్యులు తెలుపుతున్నారు. జ్వరం రావడంతో కరోనా వైరస్ సోకిందేమోనని వైద్య పరీక్షలు చేయించుకుంటున్నప్పటికీ నెగిటివ్ అధికశాతం నమోదవుతున్నట్టు జ్వరపీడితులు బాధితులు చెబుతున్నారు .మచ్చల దోమలు ,నల్ల దోమలు , పగటిపూట కరుస్తుండటంతో ఆ చోట విపరీతమైన మంట పుడుతోందని 'దద్దర్లు వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు .వాతావరణంలో మార్పులు రావడం ఒకవైపు వర్షాలు కురుస్తుండటంతో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తూ విషజ్వరాలు రావడానికి కారణమవుతున్నాయి. జ్వరం రావడంతో గ్రామాలలో ఆర్ఎంపీ వైద్యులను ప్రజలు సంప్రదిస్తు వైద్యం పొందుతున్నారు .పట్టణంలోని ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్నారు .పట్టణంలోని వివిధ వార్డుల్లో గహిణులకు జ్వరాలు అధికంగా వస్తున్నాయి.మున్సిపల్ పాలకవర్గం అధికారులు పట్టణంలో నిలిచిపోయిన డ్రైనేజీని తొలగించడంతోపాటు బ్లీచింగ్ చల్లడంతోపాటు ఫాగింగ్ దోమల నివారణకు పిచికారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.