Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి ఆవరణలో వర్షపు నీరు చేరి చెరువులా తలపిస్తుండగా రోగులు ఆస్పత్రికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ప్రభుత్వాస్పత్రిలో సీపీఐ(ఎం) డీవైఎఫ్ఐ శ్రమదానం చేశారు. నిల్వ ఉన్న నీటిని కాల్వలు చేసి బయటికి పంపించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి జల్లేల పెంటయ్య మాట్లాడుతూ చిన్న వర్షం వచ్చినా ఆసుపత్రిలోకి వెళ్లరాకుండా నీరు నిలుస్తుందని, పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు. ఆస్పత్రి ఆవరణలో అనాలోచితంగా మరుగుదొడ్లు నిర్మించటంతో నీరు బయటకి పోక నిలుస్తుందని, వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు నాగటి ఉపేందర్, ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, టౌన్ కార్యదర్శి గాదె నరేందర్, మండల కమిటీ సభ్యులు బోయిని ఆనంద్, గన్నెబోయిన విజయభాస్కర్, కల్లూరి నగేష్, ఆ సంఘం మండల అధ్యక్షులు మెట్టు శ్రవణ్, జనపాల లక్ష్మణ్, శానగొండ వెంకటేశ్వర్లు, రామచంద్రం, గంటెపాక శ్రీకష్ణ తదితరులు పాల్గొన్నారు.