Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నేటి నుంచి పాఠశాలలు తెరవాలని సంకల్పించిన ప్రభుత్వానికి హైకోర్టు స్టే విధిస్తూ బ్రేక్ వేసింది. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున పాఠశాలలు ప్రారంభానికి అవకాశం ఇవ్వొద్దని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద వేసిన కేసును కోర్టు మంగళవారం విచారణకు చేపట్టింది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికీ కోవిడ్ తీవ్రత కొనసాగుతుందన్నారు. అందుకే ప్రత్యక్ష బోధన తరగతులకు రావాలని పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దన్నారు. ఆన్లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యాసంస్థలు నిర్ణయించుకోవచ్చన్నారు. కోవిడ్ కారణంగా ప్రత్యక్ష బోధనను నిర్వహించని విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కూడా 4మిగతా 3లో...
మోగిన బడిగంట...
కోర్టు సూచించింది. హాస్టల్స్, గురుకులాలు తెరవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. అంతేగాకుండా వసతులపై నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీచేసింది. విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా ప్రభుత్వం రెండింటినీ సమన్వయం చేసుకోవాలన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 4245 పాఠశాలలు ఉన్నాయి. అందులో సుమారు 4.54లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే గురుకులాలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు 141 ఉన్నాయి. వీటిల్లో సుమారు లక్ష మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది మార్చి 22నుంచి కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పాఠశాలలు బంద్ చేశారు. నాటి నుంచి పాఠశాలలు ఆన్లైన్ తరగతులకే పరిమితమయ్యారు. జులై మాసంలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కరోనా తగ్గలేదని వైద్యులు సూచనలు చేశారు. దీంతో ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. అయితే గత నెల రోజులుగా పాఠశాలలు ప్రారంభించకపోతే విద్యార్థులకు తీవ్రనష్టం జరిగే అవకాశం ఉందని, అందుకే పాఠశాలలు, కాలేజీ, యూనివర్సీటీలు తెరవాలని తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నుంచి పెద్దఎత్తున ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసి పున ప్రారంభానికి గ్రీన్ సిగల్ ఇచ్చింది. పట్టణాలలో, గ్రామాలలో పాఠశాలలను శుభ్రం చేస్తూ శానిటైజేషన్ చేయించే బాధ్యతను స్థానిక సంస్థలదే అంటూ ఉత్తర్వులు కూడా జారీచేశారు. దానికి అనుగుణంగా పాఠశాలలు, గురుకులాలు అన్నింటిని కూడా విద్యాశాఖ, స్థానిక సంస్థలు శానిటైజేషన్ చేయించి పూర్తిగా సిద్ధం చేశారు.
గురుకులాలు మినహాయింపు...
హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సవరణలు చేస్తూ నేటి నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురుకులాలు మినహాయించి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కేజీ నుంచి పీజీ వరకు, అంగన్వాడీ కేంద్రాలను కూడా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే గురుకులాల్లో మాత్రం హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాన్ని వాయిదా వేశారు. విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరు కావాలని ఎలాంటి ఒత్తిడి పెట్టొద్దని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇదిలా ఉంటే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలా, ఆన్లైన్ తరగతులు నిర్వహించాలా అనే స్వేచ్ఛను ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలకు ఉంటుందని ప్రభుత్వ ఉత్తర్వులలో స్పష్టం చేశారు.