Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ వారి వారి కేటాయించిన గ్రామాల్లో వార్డుల్లో ఆయా ముఖ్య కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులను కలుపుకొని పార్టీ కమిటీ, అనుబంధ కమిటీలను పార్టీ నియమావళి ప్రకారం పార్టీ విధేయులను, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసే నాయకులను కమిటీ లో ఉండే విధంగా చూసుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లాకేంద్రంలోని వీటి కాలనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే నల్లగొండ నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల కోసం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను ఎన్నికల అధికారులుగా నియమించి మాట్లాడారు. అదేవిధంగా సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 9 గంటలకు, అన్ని గ్రామాలలో పట్టణ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఒకే సమయానికి జెండా పండుగ నిర్వహించాలన్నారు.మండలకేంద్రం, జిల్లాకేంద్రంలో ఉదయం 10 గంటలకు టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వలి, మున్సిపల్ చైర్మెన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మార్కెట్ కమిటీ చైర్మెన్ బొర్ర సుధాకర్, కనగల్ జెడ్పీటీసీ చిట్ల వెంకటేశం, పార్టీ రాష్ట్ర నాయకులు కటికం సత్తయ్యగౌడ్,సుంకరి మల్లేష్‌గౌడ్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణఅధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్, మండలఅధ్యక్షులు పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య, సింగిల్‌విండో చైర్మెన్లు పాశం సంపత్‌రెడ్డి, ఆలకుంట్ల నాగరత్నంరాజు పాల్గొన్నారు.