Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చిన్నగారకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై బత్తిని శ్రీకాంత్‌గౌడ్ వివరాల ప్రకారం..పెద్ద సీతారాంతండాకు చెందిన అంగోతు నాగు, చిన్న సీతారాంతండాకు చెందిన బాణోతు లింగాల మధ్య భూమి విషయంపై ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అదే పొలంలో పని చేస్తున్న చిన్నసీతారాంతండాకు చెందిన బాణోతు లింగా తండ్రి బాణోతు దంజా (57) పొలం వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాడు. తన తండ్రిని మల్సూర్ అనే వ్యక్తి హత్య చేశాడని ఆరోపిస్తూ లింగా తన తండ్రి మృతదేహాన్ని గ్రామంలోని మల్సూర్ ఇంటి ముందు ఉంచి ధర్నా నిర్వహించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.