Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొంగిపొర్లుతున్న బిక్కెరు, మూసీ కాల్వలు
నిండుకుండలా చెరువులు కుంటలు
నవతెలంగాణ- భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో ప్రధానంగా తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, ఆత్మకూర్, మోత్కూర్, గుండాలలో ఉన్న బీక్కెరు వాగు, బీబీనగర్, భువనగిరి, వలిగొండ రామన్నపేటలో ప్రవహించే మూసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాజపేట మండలం కుర్రారంలో దోసవాగులో ఇద్దరు అమ్మాయిలు సోమవారం గల్లంతయ్యారు. వర్షానికి పాత ఇండ్లు, రేకుల షెడ్లు, చెట్లు కూలిపోయాయి. ఆలేరులో కుమ్మరి వాడ, పెద్దమ్మ వాడ, సిల్క్ నగర్, మార్కండేయ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. రేషన్ డీలర్ వంగరి శివకుమార్ షాప్‌లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో నిత్యావసర సరుకులు తడిసిపోయాయి.
వాగులు పొంగి పొర్లుతుండడంతో ప్రయాణానికి అంతరాయాలు
జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రహదారుల మీద కూడా వర్షపు నీరు వచ్చి. రాకపోకలకు ఇబ్బందులూ అడుగుతున్నాయి వలిగొండ మండలం లో రెండు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. భువనగిరి మండలం రాయగిరి మోత్కూర్ రోడ్డు పై రాయి పల్లి గ్రామాల సమీపంలో సర్వీస్ రోడ్డు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వలిగొండ మండలం నాగారం తుమ్మలగూడెం గ్రామాల మధ్య, భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంటలు నీట మునిగాయి.
జాగ్రత్తలు పాటించండి.
కాలువల వద్ద నీటి ప్రవాహాలు అధికంగా ఉన్నాయని పగలు అటువైపు వెళ్లవద్దని జాగ్రత్తలు పాటించాలని రెవెన్యూ అధికారులు, పోలీసులు విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో వర్షపాతం
జిల్లాలో సోమవారం నుండి మంగళవారం వరకు నమోదైన వర్షపాతం. అత్యధికంగా పోచంపల్లిలో 50 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గుండాల మండలంలో 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుర్కపల్లి లో 6.2 రాజాపేట లో 2.4 కాలేజీలో 12.4 మోటకొండూరు 18.2 యాదగిరిగుట్ట 31.4 భువనగిరి 8.4 బొమ్మలరామారం 18.4 బీబీనగర్ 20.8 పోచంపల్లి 50 3.4 చౌటుప్పల్ 40.2 నారాయణపూర్ 33.4 వలిగొండ 13.6, ఆత్మకూర్ ఎం 27.8, మోత్కూర్ 9.2, అడ్డగూడూర్ 8.2, గుండాల 5.0 వర్షపాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా 200 48.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం 400 10.6 మిల్లీమీటర్ల నమోదు కావాల్సి ఉండగా 642.3 వర్షపాతం కురిసింది. 56 శాతం అధికంగా నమెదైంది.
ఆలేరురూరల్ :మండలంలోని మంతపురి గ్రామ సమీపంలోని నీళ్ల ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులో నుండి నడుచుకుంటూ వెళ్లాలంటే ప్రయాణికుల ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి నెలకొంది .చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆలేరు కు వెళ్లాలంటే ఈ నీల ఒర్రె నుండే పోవాలి .మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రోజులు రాకపోకలు బంద్ కావడంతో మంగళవారం ఊపిరి పీల్చుకొని ప్రయాణికు లు ఒక్కొక్కరుగా నడుచుకుంటూ ఇతరుల సాయంతో బయటకు పోయారు. మండలంలోని కొల్లూరు గ్రామంలో బీసు యాదగిరి కాంగ్రెస్ పెంకుటిల్లు కూలింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.