Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అవంతీపురం మిషన్‌భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో ఘటన
నవతెలంగాణ-మిర్యాలగూడ
మండలంలోని అవంతీపురం మిషన్‌భగీరథ వాటర్ ట్రీట్మెంట్? ప్లాంట్‌లో చేపట్టనున్న సివిల్వర్క్స్పై సర్వే చేస్తుండగా సైట్ సివిల్ఇంజనీర్విద్యుత్ షాక్‌తో మరణించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రూరల్‌పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సాపురం గ్రామానికి చెందిన వీరంకి చెన్నకేశవులు(24) రాఘవ కనస్ట్రక్షన్స్ కంపెనీలో సైట్ ఇంజనీర్‌గా జాయినై అవంతీపురం మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ప్లాంట్లో 9 నెలలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్లాంట్‌లో సివిల్ వర్క్స్ చేపట్టేందుకు సర్వే పనులు చేస్తున్నారు.కాగా సర్వే స్టిక్(స్కేల్) ట్రీట్‌మెంట్‌ప్లాంట్ పరిధిలోని 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుద్ఘాతానికి గురయ్యాడు. గుర్తించిన సహచరులు ట్రీట్మెంట్ నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి..!
సివిల్ఇంజనీర్గా పనిచేస్తూ విద్యుత్‌షాక్‌తో మతి చెందిన చెన్నకేశవులుపైనే అతని కుటుంబం పూర్తిగా ఆధారపడి ఉందని అవంతీపురం మిషన్‌భగీరథలో పనిచేసే కాంట్రాక్ట్ఎంప్లాయీస్తెలిపారు.రాఘవ కనస్ట్రక్షన్స్ కంపెనీ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.