Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తుంగతుర్తి
ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం ఈ నెల 2న టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆ పార్టీ మండలాధ్యక్షులు గుడిపాటి సైదులు, ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ తెలిపారు. మంగళవారం స్థానిక మండల కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2న మండలకేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ పార్టీ జెండాలను ఎగుర వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మెన్ గోపగాని రమేష్‌గౌడ్, పట్టణాధ్యక్షులు బీరపూల నారాయణ, ఎల్లబోయిన బిక్షం, గుండగాని దుర్గయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గోపగాని శ్రీనివాస్, పులుసు వెంకట్ నారాయణ, పూసపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి : సెప్టెంబర్ 2న మండలంలోని అన్ని గ్రామాల్లోనూ టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించాలని ఆ పార్టీ మండలాధ్యక్షులు సంకెపెల్లి రఘునందన్‌రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే గెస్ట్‌హౌస్‌లో ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల అనుబంధ నాయకులు, పార్టీ నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జెండా పండుగ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహలత, మార్కెట్ కమిటీ చైర్మెన్ మూల అశోక్‌రెడ్డి, జెడ్పీటీసీ దూపటి అంజలి రవీందర్, మాజీ ఎంపీపీ సతీష్, తిరుమణి యాదగిరి, బత్తుల శ్రీనివాస్, కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, భాస్కర్, సందీప్‌నేత, షకీల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నూతనకల్ : ఈ నెల 2న నిర్వహించనున్న టీఆర్ఎస్ జెండా పండుగను విజయవంతం చేయాలని ఆ మండలాధ్యక్షులు మున్న మల్లయ్య యాదవ్ కోరారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డుల పరిధిలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ జెండా పండుగకు వచ్చేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ వెంకట వెంకన్న, ఏఎంసీ డైరెక్టర్ విక్కీ బుచ్చయ్యగౌడ్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బత్తుల సాయిల్‌గౌడ్, ప్రచార కార్య నిర్వహణ కార్యదర్శి బత్తుల విద్యా సాగర్, సీనియర్ నాయకులు పన్నాల సైదిరెడ్డి, పన్నాల రమ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
. మఠంపల్లి : ఈ నెల 2న నిర్వహించనున్న పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహించాలని ఎంపీపీ మూడవతు పార్వతి కొండానాయక్ కోరారు. గ్రామాలు, వార్డుల్లో పార్టీ జెండాలను ఎగుర వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జగన్నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోలాహలం కష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.
నాగారం : ఈ నెల 2న టీఆర్ఎస్ జెండా పండుగను అన్ని గ్రామాల్లోనూ నిర్వహించాలని ఆ పార్టీ మండలాధ్యక్షులు కళ్లెట్లపల్లి ఉప్పలయ్య కోరారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మార్కెట్ వైస్ చైర్మెన్ గుండగాని అంబయ్య, రైతు సమన్వయ సమితి కోఆర్డినర్ పానుగంటి నర్సింహారెడ్డి, రైతుబంధు జిల్లా సభ్యులు పొదిల రమేష్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు దోమల బాలమల్లు, మండల ప్రధాన కార్యదర్శి కేశగాని అంజయ్య, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఈదుల కిరణ్ కుమార్ పాల్గొన్నారు.