Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీవైఎఫ్ఐ మహాసభలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
సమాజానికి యువత మార్గదర్శకంగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక మార్కండేయ ఫంక్షన్హాల్లో రాగిరెడ్డి వీరారెడ్డినగర్‌లో డీవైఎఫ్ఐ పట్టణ ఏడవ మహాసభ ఎమ్‌డి.అంజద్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు యువత తాత్కాలిక ప్రయో జనాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటుందన్నారు.సమాజానికి మంచిమార్గం చూపేవిధంగా యువకులు నిలవాలని కోరారు. ప్రజలను చైతన్యపరిచే విధంగా యువకులు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజాఉద్యమాలు చేపట్టాలన్నారు.యువకులను సమీకరించి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం బలమైన పోరాటం చేయాలన్నారు. అర్హులైన పేదలకు ఇండ్లు, ఉపాధి కోసం ఉద్యమాలు నిర్వహించాలని కోరారు. అన్నివార్డుల్లో యువకులతో కమిటీలు వేసి సంఘం బలోపేతం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ మలు ్లగౌతమ్రెడ్డి, నూకల జగదీష్‌చంద్ర, గాదె పద్మ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్, రాష్ట్ర నాయకులు పతానిశ్రీనివాస్, భావండ్ల పాండు, దేశీరాంనాయక్, పాల్గొన్నారు.