Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనులు పూర్తికాక ముందే దెబ్బతింటున్న రోడ్లు
నవతెలంగాణ-వేములపల్లి
అధికారుల పర్యవేక్షణ లోపం,కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వపనుల్లో నాణ్యత లోపిస్తుంది. రూ.కోట్లు వెచ్చించినా అభివద్ధి శూన్యం అవుతుంది.మండలంలోని వేములపల్లి ఎన్నెస్పీ క్యాంప్ నుండి తిమ్మారెడ్డిగూడెం మీదుగా మిర్యాల గూడ మండలం ఆదర్శనగర్ వరకు ప్రధానమంత్రి గ్రామీణసడక్ యోజన పథకం కింద సుమారు రూ.3.50కోట్లతో 6.50 కిలోమీటర మేర బీటీరోడ్డు పనులను ఇటీవల ప్రారంభిం చారు.రహదారి నిర్మాణంలో 11 కల్వర్టులు, ఒక కాజ్వే నిర్మాణం చేపట్టారు.పనులు తుదిదశకు చేరుకున్నాయి.ఇదిలా ఉండగా పనుల్లో నాణ్యత లోపించి పచ్చారుగడ్డ సమీపంలో నడిరోడ్డుపై భారీ గుంత ఏర్పడడంతో మరమ్మతులు చేపడు తున్నారు.కాగా ఇటీవల కురుస్తున్న వర్షాలతో రహదారి నిర్మాణంలో భాగంగా నిర్మించిన కల్వర్టులు నాసిరకంగా నిర్మించడంతో కల్వర్టులు దెబ్బతిన్నాయి.కల్వర్టుల వద్ద రోడ్డు కోతకు గురై రహదారి అస్తవ్యస్తంగా మారింది.దీంతో సమీపరైతుల పంటపొలాల్లో ఇసుకమేటలతో పంట దెబ్బ తింటుందని రైతులు వాపోతున్నారు. నాణ్యతా లోపంతో పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని, పనులు నాణ్యతతో చేపట్టాలని స్థానిక ప్రజలు,రైతులు కోరుతున్నారు.