Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుండి డిండికి నీళ్లు ఇస్తనే జిల్లాకు ఉపయోగం ఉంటుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం దేవరకొండలో ప్రాజెక్టులపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పేరుతో కాలయాపన చేస్తూ నల్లగొండ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రెండున్నరేండ్లలో జిల్లాకు నీరు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నేటికీ అమలు చేయకపోవడం విచారకరమన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా డిండి రిజర్వాయర్ నుండి దేవరకొండ, మునుగోడు నల్లగొండ నియోజకవర్గాలకు సాగు, తాగునీరందిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నేటికీ నల్లగొండ జిల్లాకు ఎక్కడ నుంచి నీళ్లు ఇస్తారో నిర్ధారణ చేయలేదన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉజ్జిని యాదగిరిరావు, పల్లా దేవేందర్‌రెడ్డి, బొడ్డుపల్లి వెంకటరమణ, మండల కార్యదర్శులు పి.కేశవ రెడ్డి, తూమ్ బుచ్చిరెడ్డి, పోలే వెంకటయ్య, ఉప్పునూతల వెంకటయ్య, కె జయరాములు, బి.అచ్చయ్య, జీ.వెంకటేశ్వరరెడ్డి, ఎమ్‌డి. మైనొద్దీన్, వై.పాండు రంగారెడ్డి, ఎస్.కనకాచారి, డి సుదర్శన్‌రెడ్డి, ఎన్.రామస్వామి, ఎన్.వెంకటేశ్వర్లు, జె.వెంకట్రా ములు, వి.ఆంజనేయులు పాల్గొన్నారు.