Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతులను కొట్టడం అమానుషం
మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
రైతు సంఘం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో రైతువ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణకు మొగ్గు చూపుతూ రైతాంగానికి తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు.ప్రభుత్వ తీరును నిరసిస్తూ హర్యానాలో రైతులు ఆందోళన చేస్తే అక్కడి ప్రభుత్వం రైతులపై లాఠీచార్జి చేయించడం దారుణమన్నారు.రైతులపై లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.రైతు లేనిదే సమాజం లేదని,వారి కోసం అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. వారి పోరాటానికి సంఘీభావం తెలిపి వ్యతిరేక చట్టాలు రద్దయ్యేంత వరకూ వారికి అండగా నిలవాలన్నారు.సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వాలకు ప్రజల త్వరలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు పగిడోజు రామ్మూర్తి, రాగిరెడ్డి మంగారెడ్డి, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, సత్య నారాయణరావు,రాంరెడ్డి, చౌగాని సీతారాములు, రొండి శ్రీనివాస్, రామారావు పాల్గొన్నారు.