Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
లయన్స్ క్లబ్ సభ్యులు ముత్తినేని జయప్రకాష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మెగా డయాబెటిక్ క్యాంప్ నిర్వహించి పేదలకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. అలాగే 86 మందికి షుగర్ పరీక్షలు చేయగా 15 మందికి షుగర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. వ్యాధిగ్రస్తులకు సూచనలు అందించారు. అనంతరం లయన్స్ క్లబ్ భవన్లో 30 మంది పేదలకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ శారద, బోనగిరి శంకర్, తమ్మి రమేష్, అధ్యక్షుడు యాకూబ్, సెక్రెటరీ చిదిరాల నవీన్‌కుమార్, ట్రెజరర్ చీదర మహేష్ తదితరులు పాల్గొన్నారు.