Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
ఎమ్మెల్యే సీతక్క చొరవతోనే జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య మంగపేట గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ 20 లక్షలు కలెక్టర్ ప్రత్యేక నిధులు 30 లక్షలు కలిపి 50 లక్షలతో మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సెంటర్ నుండి కోమటిపల్లి క్రాస్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేసినట్లు కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అద్యక్షుడు గుమ్మడి సోమయ్య తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు. మండలంలో వందల సార్లు పర్యటించిన ఎమ్మెల్యే సీతక్కకు మండలంలోని ప్రతి గ్రామంలో గల్లీ గల్లీ తెలుసని దాంతోనే ఎక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీలు అవసరమో వాటి ప్రతిపాదనలు కలెక్టర్ సంబందిత అధికారులకు అందించి పనులు సాంక్షన్ చేయించారని అన్నారు. మండల అభివద్ధి టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అని చెప్పుకునే నాయకులు సిగ్గుపడాలని గుమ్మడి సోమయ్య హితవు పలికారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పైసా ఇవ్వని టీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఇంచార్జ్ లకు నిధులు ఇచ్చి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. మండల కేంద్రంలోని సీసీ రోడ్డు విషయంలో సైతం ఆ పార్టీకి చెందిన నాయకుడు తమ ప్రభుత్వం చేస్తున్నపనంటూ అప్పటి ఎంపీడోవోపై వత్తిడి చేసి కాంట్రాక్టర్ నుండి లక్ష రూపాయలు కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలిసిన తాము ఎమ్మెల్యేతో చెప్పి పనిని క్యాన్సిల్ చేసి కలెక్టర్ తో చెప్పి టెండర్ పెట్టించి నాణ్యతగా రోడ్డు వేయించిన సంగతి మండల ప్రజలకు తెలుసని గుమ్మడి సోమయ్య గుర్తు చేశారు. మా మంత్రులు చేయించారని గొప్పలు చెప్పుకునే మండల టీఆర్ఎస్ నాయకులు 50 లక్షల సీసీ రోడ్డు పనులను నామినేషన్ పద్దతిలో టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన కాంట్రాక్టర్ నుండి క్యాన్నసిల్ చేసి కలెక్టర్ టెండర్లో చేయించింది నిజం కాదని చెప్పగలరా అంటూ నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ మండలంలో చేసింది ఏమీ లేదని ఏడు సంవత్సరాలుగా గోదావరి కరకట్ట నిర్మాణం గురించి క్యాబినెట్‌లోని మంత్రులు అందరు వచ్చి చూసి హామీలు ఇవ్వడంతప్ప పనులు చేసింది ఏమీలేదని సోమయ్య అన్నారు. మంగపేట ముంపు ప్రమాదం, గౌరారంవాగు మీద పద్మశాలి వాడలో లోలెవల్ బ్రిడ్జీ నిర్మాణం, కరకట్ట నిర్మాణంపై ఎమ్మెల్యే సీతక్క రెండున్నర సంవత్సరాల్లో ఎన్ని సార్లు అసెంబ్లీలో మాట్లాడినా మీ ప్రభుత్వానికి చలనంలేదని సోమయ్య గుర్తు చేశారు. ఈ విషయం మండల ప్రజలు సోషల్ మీడియాలో గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు గొప్పలుమాని మండల కేంద్రం అభివద్ధిపై దష్టి సారించాలని హితవుపలికారు. ఎమ్మెల్యే సీతక్కను గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నాయకులకు లేదని హెచ్చరించారు. సమావేశంలో మండల పార్టీ అద్యక్షుడు మైల జయరాంరెడ్డి, తూడి భగవాన్‌రెడ్డి, చాద మల్లయ్య, నరేందర్, పొదెం నాగేశ్వరరావు, కొమరం బాలయ్య, మహిబూబ్ ఖాన్, హిదాయతుల్లా, ఆదినారాయణ, ఆకు పవన్, గౌతం కుమార్, దామెర సారయ్య, మాచిరెడ్డి వెంకట్‌రెడ్డి, కారుపోతుల నర్సయ్య గౌడ్, సురేష్, కిషోర్ రవి పాల్గొన్నారు.