Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మున్సిపల్ కమిషనర్‌కు హెచ్ఎం లేఖ
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాలో ప్రాథమిక పాఠశాలల పరిస్థితి అధ్వానంగా ఉంది. సుమారు రెండేండ్ల తర్వాత తెరుచుకుంటున్న పాఠశాల్లలను శుభ్రం చేయడం ఉపాధ్యాయుల వల్ల కావడం లేదు. పాఠశాలల్లోని స్కావెంజర్లను ప్రభుత్వం తొలగించింది. భారీ వర్షాల వల్ల పాఠశాలలు బురదమయంగా మారాయి. పాఠశాలలు కూడా శిధిలావస్థలో ఉన్నాయి. మహబూబాబాద్ పట్టణం లోని ఎంఈఓ కార్యాలయ ఆవరణలో ఉన్న గుమ్మనూరు ప్రాథమిక పాఠశాల పరిస్థితి అధ్వానంగా ఉంది ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నర్సంపేట వెళ్లే ప్రధాన రహదారి పై ఉన్న పాఠశాలలో కి పూర్తిగా వరద నీరు ప్రవహించింది ప్రధాన రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీ పూడిక మట్టితో నిలిచిపోవడంతో వరద నీరు పొంగి పాఠశాల గేట్ గుండా లోపలికి ప్రవహించింది మీరు బయటికి వెళ్లే మార్గం డ్రైనేజీ లేకపోవడంతో పాఠశాల లో నిలిచిపోయింది నీటిలో విద్యార్థులు వెళ్లడానికి రావడానికి ఇబ్బంది కరంగా ఉండే పరిస్థితి నెలకొంది ఇదే ఆవరణలో ఎంఈఓ కార్యాలయం కూడా కొనసాగుతుంది అయినా అధికారుల్లో చలనం కనిపించడం లేదు డ్రైనేజీ శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులకు లేఖ రాసిన పట్టించు కోవడం లేదు ఈ ప్రాథమిక పాఠశాలలో 84 మంది విద్యార్థులు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు సెప్టెంబర్ 1 నుంచి పాఠశాల ప్రారంభించవలసి ఉన్నది పాఠశాలకు ఎలా వెళ్లాలో అర్థం కాక ఉపాధ్యాయులు అవస్థలు పడు తున్నారు మురికినీటి మూలంగా దోమలు ప్రబలే ప్రమాదం ఉందని విషజ్వరాలు వంటి వ్యాధులు వస్తాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే డ్రైనేజీ లో పేరుకుపోయిన మట్టిని తొలగించి డ్రైనేజి శుభ్రం చేయాలని పాఠశాలలో నిలిచిన నీటిని తొలగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు
మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాశా : కృష్ణకుమారి, హెచ్ఎం
మహబూబాబాద్ పట్టణంలోని గుమ్ములూరు ప్రాథమిక పాఠశాలలో వరద నీటిని తొలగించాలని మురికి కాలువలు శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాసినట్లు హెచ్ ఎం బి కష్ణ కుమారి తెలిపారు పాఠశాలలో నిలిచి ఉన్న నీటిని తొలగించాలని కోరారు పాఠశాల ముందు ఉన్న డ్రైనేజీ పొడుగు పోవడం మూలంగా నీరు పొంగి ప్రవహించి పాఠశాలలో కి వస్తుందని అన్నారు తక్షణం మురుగు నీటిని తొలగించాలని కోరారు.