Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
గీత కార్మికులకు బైక్లు ఇవ్వాలని, దళితబంధు తరహాలో పథకాన్ని అమలు చేసి రూ.10 లక్షలు సాయం అందించాలని తెలంగాణ కల్లు, గీత కార్మికుల సంఘం (టీకేజీకేఎస్) మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని కల్వల గ్రామంలో సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమం కోసం 5 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, సొసైటీలకు 5 ఎకరాలు చొప్పున భూమి ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, నిరుద్యోగ గౌడ యువతకు ఉపాధి కల్పించాలని, మెడికల్ బోర్డు నిబంధనలు తొలగించాలని, అర్హులైన అందరికీ పింఛన్లు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే గీత వృత్తిదారులు కల్లు విక్రయించేందుకు బైక్లు సబ్సిడీపై అందించాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు ఓరుగంటి వెంకన్న, నాయకుల చింతనూరి పెద్ద వెంకన్న, మండల ఉపాధ్యక్షులు చిర్రగోని నాగేశ్వర్రావు, గండి శ్రీనివాస్, చింతనూరి చిన్న వెంకన్న, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.