Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాప్రతినిధులు లేక
ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు
గాలికొదిలేసిన ప్రజా సమస్యలు
నవతెలంగాణ - చివ్వెంల
మూడు నెలలకోసారి ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసే మండల సర్వసభ సమావేశం గురువారం మండల కేంద్రంలో తూతూ మంత్రంగా సాగింది. సమావేశానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులెవరూ పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. కేవలం 10 మంది సర్పంచులు, ఐదుగురు ఎంపీటీసీలు మినహా ఎవరూ హాజరు కాని పరిస్థితి. ఈ సందర్భంగా ఎంపీపీ ధరావత్ కుమారి, జెడ్పీటీసి భూక్య సంజీవ్ నాయక్ మాట్లాడుతూ మండల పరిధిలో ప్రజలెదుర్కుంటున్న సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు త్వరగా స్పందిం చాలని కోరారు. వైద్యాధికారి పి.రాజ్ కుమార్ మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు వ్యాక్సిన్లు, కరోనా టెస్టులు చేస్తున్నట్టు వివరించారు. మండల విద్యాశాఖ అధికారి గోపాల్ రావు మాట్లాడుతూ మండల పరిధిలోని బద్యతండా, వల్యాతండాలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్ఆర్ఎస్పీ కాలువ నుండి వచ్చే నీరు చేరుతుందని, ఉండ్రుగొండ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో పక్కనే ఉన్నా కొండపై నుంచి జాలు నీరు వచ్చి పాఠశాలలో చేరుతుందని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను మండల అధికారు లు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకో వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి, ఎంపీడీవో జమాలరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ మారినేని సుధీర్‌రావు, ఎంపీవో గోపి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.