Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
ములకలపల్లి రాములు
నవతెలంగాణ - నూతనకల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 4న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ధర్నాలు, ప్రదర్శనలు, ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు తెలిపారు. గురువారం స్థానిక తొట్ల మాల్సూర్ స్మారక భవనంలో నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన ఏడేండ్ల కాలంలో 63 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు అప్పనంగా ఆమ్మేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ సర్కార్ కుట్రపన్నుతోందన్నారు. ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఫులుసు సత్యం, మండల కమిటీ సభ్యులు పులుసు ప్రహ్లద, గజ్జల శ్రీనివాస్‌రెడ్డి, కూసు సైదులు, కల్లేపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.