Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ - చివ్వేంల
దళితబందును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని చందుపట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన దళిత వాడలో డప్పు చాటింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ భూమిని గుర్తించి దళితులకు మూడెకరాల భూమిని పంచుతున్నారని తెలిపారు. అదే మాదిరిగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్, ఎంపీటీసీ వేములపల్లి వాసుదేవరావు, మాజీ జెడ్పీటీసీ చింతమల్ల రమేష్, గాయం చంద్రశేఖర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, వెన్న మధుకర్ రెడ్డి, దొనకొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు.