Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తి
నవతెలంగాణ -రామన్నపేట
వ్యక్తిని, సమాజాన్ని అర్థం చేసుకోవడంతో పాటు, ప్రపంచ గమానాన్ని జీవిత విశాలతను తాత్వికంగా తెలుసుకోవడానికి ఉన్నత విద్య ద్వారం లాంటిదని, అమ్మ భాష అయినా తెలుగులో పట్టు సాధిస్తూనే ప్రపంచంలో మనుగడ సాధించడానికి ఆంగ్ల విద్యను కూడా అభ్యసించి పట్టు సాధించాలని చలనచిత్ర నిర్మాత దర్శకులు ఆర్. నారాయణ మూర్తి అన్నారు. రామన్నపేట చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకోవడానికి వచ్చిన నారాయణ మూర్తి గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి కళాశాల పనితీరును ప్రశంసించారు. ప్రధానాచార్యులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులతో ఆర్.నారాయణ మూర్తి మాటా మంతి పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల అభివద్ధితోనే దేశం నిజమైన ప్రగతిని సాధిస్తుందన్నారు ఇక్కడి వ్యవసాయిక నాగరికత ఎంతో ఉజ్వలమైందని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రామన్నపేట ప్రాంతానికి ఘనకీర్తి ఉందన్నారు. విద్యార్థుల్లో సామాజిక సినిమాలను చూసి స్ఫూర్తి పొందేతరం రావాలని, సామాజిక ప్రయోజనం ఆశించే తాను చలనచిత్రాలు నిర్మిస్తున్నానని రైతన్న సినిమా అటువంటిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డా.బెల్లి యాదయ్య, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఏఓ మంజర్, జాఫ్రి అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నారాయణమూర్తికి సన్మానం
ప్రముఖ సినిమా డైరెక్టర్, హీరో ఆర్ నారాయణ మూర్తి తాను దర్శకత్వం వహించి నటించిన రైతన్న సినిమాను అందరూ చూసి ఆశీర్వదించాలని కోరడానికి వచ్చిన సందర్భంలో నకిరేకల్ నియోజకవర్గ ఎంబీసీ చైర్మెన్్ కోట సుధాకర్ గురువారం మండల కేంద్రంలో నారాయణ మూర్తిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామిని రమేష్, బుర్రి రవీందర్, మినుముల సందీప్, వనం శ్రీహరి, గోదాసు ప్రవీణ్, గంగాపురం శంకర్, పల్లపు రవి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.