Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజా నాట్యమండలలి
రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ
నవతెలంగాణ -రామన్నపేట
ప్రజా కళాలను కాపాడుకోవాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పిలుపునిచ్చారు. ఈ నెల 12న వలిగొండలో నిర్వహించే ప్రజానాట్యమండలి యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సాంస్కతిక సమ్మేళనంను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవులు, కళాకారులు రచయితలు మేధావులు, అభ్యుదయవాదులు సమ్మేళనంలో పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చి భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి అధ్యక్షులు గంట పాక శివ, కార్యదర్శి దేశ పాక రవి, జిల్లా నాయకులు కందుల హనుమంతు, మేడి ముకుందం, మెట్టు శ్రవణ్, బింపాక ప్రశాంత్, పిట్టల శీను తదితరులు పాల్గొన్నారు.