Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
నవతెలంగాణ - భువనగిరి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు లేబర్కోడ్లుగా మార్చిందని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆ సంఘం యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లా ఆఫీస్ బేరర్స్ జిల్లా కమిటీ సభ్యుల, స్థానిక యూనియన్ల అధ్యక్ష ,కార్యదర్శులు సమావేశం కోమటిరెడ్డి చంద్రా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడారు ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు, డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచడం, ప్రభుత్వ రంగ సంస్థలు పెట్రోలియం, రైల్వే, విమానయానం, రక్షణ రంగం, ప్రైవేటు పెట్టుబడిదారులకు కారుచౌకగా దేశ ప్రజలకు, కార్మికులకు అనేక ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదించి, పరిశ్రమలలో పనిచేసే కార్మికుల ఐక్యతతో యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా చట్టాలను మార్చడం హేయమైన చర్యన్నారు. కాంట్రాక్టు క్యాజువల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం వెంటనే కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శ్రీకాంత్ ,జిల్లా కార్యదర్శి దాసరి పాండు జనగాం జిల్లా కార్యదర్శి రాపార్తి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, సహాయ కార్యదర్శి ఎండి.భాష ఉపాధ్యక్షులు కూరెల్ల రాములు, తుర్కపల్లి సురేందర్, జిల్లా కమిటీ సభ్యులు మయకష్ణ, బండారు శ్రీరాములు, మంచాలమధు, అన్నబోయిన రాజు, మచ్చ వెంకన్న, బి. ప్రశాంత్, ప్రవీణ్, మల్లేష్ పాల్గొన్నారు.