Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీిఆర్ ఒక్కసారైనా యూనివర్సిటీలో కాలు పెట్టావా?
- బండి సంజయ్.. నీ సంగ్రామం ఎవరిమీద ?
- బీసీ గణన ఎందుకు చేయడం లేదు ?
- హుజురాబాద్లో బీజేపీ, టీఆర్ఎస్లో హైడ్రామా
- రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి రాబోతుంది
- రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ - భువనగిరి
బహుమని సుల్తానుల నుండి కుతుబ్ షాహీ సుల్తాన్ల వరకు వారిని గడగడలాడించిన బహుజన గండరగండడు సర్దార్ సర్వాయి పాపన్న వారసులమని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని లింగ బసవేశ్వర ఫంక్షన్ హాల్లో నల్గొండ ఉమ్మడి జిల్లా ఆ పార్టీ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ మంద ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ బీజేపీలను అనేక ప్రశ్నలు సంధించి అక్కడికి వచ్చిన జనాన్ని చైతన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న చిన్నతనం నుండే జమీందారులు భూస్వాములు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని తెలిపారు. ఆయన బాటలోనే నడవాలని కోరారు. క్రూరుడు నయీమ్ చేతిలో బహుజనుల బిడ్డ బెల్లి లలిత హత్యకు గురైందని గుర్తుచేశారు. ఎందరో అమరవీరుల పోలీస్ కిష్టయ్య, శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామనానరు. రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బడా కాంట్రాక్టర్లకు వేల కోట్లు కేసీఆర్ పెడుతున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అదనంగా సుమారు లక్షా 30వేల కోట్లు ఖర్చు అవుతుందని పత్రికల్లో వచ్చిందన్నారు. కాంట్రాక్ట్ లలో ఎందరు బహుజనులు ఉన్నారని, ఎందరి బహుజన భూమి సాగవుతుందని ప్రశ్నించారు. బహుజనులు బిచ్చగాళ్ళుగా బతుకుతున్నారని , స్కీములు వద్దని ఎదగడానికి మార్గాలు కావాలని కోరారు. రాబోయే కాలంలో బీఎస్పీ అధికారంలోకి రాబోతున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ రాష్ట్ర అడ్వైజర్ తన పదవీకాలంలో ఐదారుసార్లు కేసీిఆర్ ను చూసి ఉంటారని తెలిపారు. ఎంతో సీనియర్ అయిన అధికారికి పరిస్థితి ఇలా ఉంటే బహుజన ఐఏఎస్, ఐపీఎస్ల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తుర్కపల్లి మండలంలో దళితుల కోసం భోజనాలు పెట్టడం, దళిత బంధు ప్రకటించడం అంతా డ్రామా అన్నారు. దళితుల మీద చిత్తశుద్ది ఉంటే మొదటిసారి గెలిచినప్పుడే వారి అభివద్ధి కోసం కషి చేసే వారన్నారు. ప్రగతి భవన్ చుట్టూ రాజకీయాలు కాదని, అంబేద్కర్ భవనం చుట్టూ రాజకీయాలు జరిగే విధంగా చూస్తామన్నారు. జ్యోతి రావు పూలే, సావిత్రి బాయి పూలే, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి కుట్రలు బయటపెడతామని హెచ్చరించారు. బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ కానుకలతో ఆర్థికంగా బలపడరని వేల సంవత్సరాలుగా ఆ పండుగ అత్యంత ఘనంగా జరుపుకుంటున్న మని చెప్పారు.
ఒక్కసారైనా యూనివర్సిటీల కి వెళ్ళావా?
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్రవర్ణాల పేదలు చదువుకునే తెలంగాణ యూనివర్సిటీల్లో ఒక్కసారైనా కేసీఆర్ కాలు పెట్టాడా అని ప్రశ్నించారు. యూనివర్సిటీలలో 3వేల ప్రొఫెసర్ల పోస్టులు అవసరముండగా 800 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అనురాగ్, మల్లారెడ్డి యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీల మీద ఉన్న ప్రేమ తెలంగాణలోని ప్రభుత్వ యూనివర్సిటీల మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి భాష, ఆయన మాటలు మాట్లాడలేనని అన్నారు. ఆ మాటలు మాట్లాడితే ఇక్కడ ఉన్న సోదరీమణులు ఏం చేస్తారో అందరికీ తెలుసునన్నారు. గొర్రెలు బర్రెలు, మేకలు, సైకిళ్లు, వాహనాలతో బహుజనుల పరిస్థితి మారదని వారికి విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి కల్పించినప్పుడే జీవన పరిస్థితి మెరుగుపడుతుందన్నారు.
సంజయ్ నీ సంగ్రామం ఎవరిమీద?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు నీ సంగ్రామం ఎవరి మీద చేస్తున్నావు అని ప్రశ్నించారు. టీిఆర్ఎస్, బీజేపీలు అంతర్గత ఇచ్చిపుచ్చుకునే పార్టీలే కదా అని ఎద్దేవా చేశారు. బీసీ గణాంకాలు తెలుపమని సుప్రీంకోర్టు చెప్పినా బీజేపీ పట్టించుకోవడం లేదని తెలిపారు. బీసీల గణనచేయాలని బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి పార్లమెంట్లో ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలో ప్రభుత్వ రంగాలను ఎందుకు ప్రైవేటుపరం చేస్తుందో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజరు తన సంగ్రామాన్ని కేంద్రంలోని బీజేపీ మీద కూడా చేయాలని కోరారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీిఆర్ఎస్, బీజేపీిల మధ్య ఒక పెద్ద హైడ్రామా జరుగుతుందన్నారు. దీన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరికీ అమ్ముడుపోడన్నారు. బహుజన రాజ్యం సాధించేవరకు తన బోందులో ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతామని తెలిపారు. బీఎస్పీ నాయకులు కార్యకర్తలు వాహనాలకు నీలిరంగు జెండాలు కట్టుకొని వెళ్లి ప్రతి ఇంటికి తిరుగుతూ బహుజనులను చైతన్యవంతం చేయాలన్నారు. హుజురాబాద్లో బీఎస్పీ కార్యకర్తలు సైకిల్ మీద గ్రామాలకు తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.