Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గరిడేపల్లి
మండలంలోని మంగాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ప్రఖ్యాత నాటక రచయిత పోతుగంటి రామకృష్ణయ్య గుప్త (89) శుక్రవారం ఉదయం మృతి చెందారు. 1957లో జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఆంధ్ర పత్రిక, గోల్కొండ పత్రిక, జనవాణి తెలుగు పత్రికలతో పాటు కొన్ని ఉర్దూ పత్రికల్లో ఆయన ప్రూఫ్ రీడర్‌గా, జర్నలిస్ట్‌గా, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా, కాలమిస్ట్‌గా పని చేశారు. ఆయన మంచి రచయిత కూడా. కట్ జోకర్, ఎమ్మెల్యే గారి భార్య, వీడని నీడలు, చక్రబంధం తదితర నాటికలు, పద్యాలు, కథలు రాశారు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. రామకృష్ణయ్య మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, సాహిత్యకారులు సంతాపం ప్రకటించారు. సంతాపం ప్రకటించిన వారిలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కొండ సైదులుగౌడ్, సీనియర్ జర్నలిస్టు ముచ్చర్ల గోపాలకృష్ణ, మేకపోతుల వెంకటేశ్వర్లు, నట్టే కోటేశ్వర్రావు, తాటికొండ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కడారి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రావుల వెంకన్న, బుడిగె శంకర్, చాగంటి వీరయ్య, నర్సింగ్, నరేష్, ఎల్లావుల వెంకటేష్, కొలిపాక జగదీష్, వల్లపు దాసు జోష్ పాల్గొన్నారు