Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కేంద్రం ఇచ్చిన నిధులతోనే
రాష్ట్రంలో అభివద్ధి
అ పేదోన్ని బాగు పరుస్తాం అంటే
రాజీనామాకు నేను సిద్ధం
అ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నవతెలంగాణ- రామన్నపేట
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించ లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో గ్రామ దర్శనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పేదోడి కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు వేరని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జరుగుతుందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్ర పేద ప్రజలకు నిధులు మంజూరు చేసి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కోట్లాది రూపాయల డబ్బులు రైతుబంధు రూపంలో ఉన్నోడికి పోతున్నాయని ఆరోపించారు. ఎంపీనో, ఎమ్మెల్యేనో రాజీనామా చేస్తే నిధులు ఇస్తున్నారన్నారు. నియోజకవర్గం లోని పేద ప్రజలను ఆర్థికంగా బాగా పరుస్తామంటే రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.