Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
కోదాడ నియోజకవర్గంలో అక్రమంగా సాగుతున్న బెల్ట్‌షాపు దందాను అరికట్టాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నల్లగొండ పార్లమెంట్ కోకన్వీనర్ పచ్చిపాల వేణుయాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎస్సై కె.సైదులుకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని 118 గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలో వందలాది బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆరోపించారు. ఇటీవలే రామాపురం క్రాస్ రోడ్డులో వైన్‌షాప్ ఓనర్ల దౌర్జన్యంతో ఒకరు మృతి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పెద్దిరెడ్డి చంద్రశేఖర్, కర్ల సుందర్‌బాబు, స్టేట్ యూత్ మెంబర్ మహమ్మద్ రఫీ, లంకెల కృష్ణారెడ్డి, ఇలవాల శివశంకర్‌రెడ్డి, రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.