Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని, రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌చేస్తూ సీపీఐ(ఎం), డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్.లింగోటం గ్రామ పర్యటనలో భాగంగా కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్‌కు జైకేసారం గ్రామంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకష్ణ మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. నిరసన తెలుపుతున్న స్పందించకుండా మంత్రి వెళ్లిపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోదాసు వెంకటేశం, పొట్ట శ్రీనివాస్, మాడగోని మారయ్య, పల్లె శివకుమార్, దొడ్డి లింగస్వామి, ఎడ్ల ముఖేశ్, పల్లె శ్రీకాంత్, తలాటి రాజు, కొర్పూరి ధనంజి, కిరణ్, సైదులు, తాటి చంద్రమౌళి, గణేశ్, మధు, శివ పాల్గొన్నారు.