Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్
మోరేశ్వర్ పాటిల్
నవతెలంగాణ-చౌటుప్పల్
రాజకీయ పార్టీలకతీతంగా గ్రామాల అభివద్ధే కేంద్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యమని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలపరిధిలోని ఎస్.లింగోటం గ్రామానికి అభివద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రికి సర్పంచ్ ఆకుల సునీతశ్రీకాంత్, ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పూలబొకేలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామ శివాలయం వద్ద నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. గాంధీజీ కన్న గ్రామ స్వరాజ్యం కళలను ప్రధానమంత్రి మోడి నెరవేర్చుతున్నారని తెలిపారు. ఆవాజ్ యోజన పథకం ద్వారా పేద ప్రజల కోసం ఎన్ని ఇండ్లనైనా నిర్మిస్తామని తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణతోపాటు భువనగిరి పార్లమెంట్, మునుగోడు నియోజకవర్గ అభివద్ధికి కేంద్రం నుండి అధిక నిధులు కేటాయించాలని కోరారు. ప్రజలు, కార్మికులు, వివిధ పార్టీల నాయకులు పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. డీఆర్డీఓ పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో జెడ్పీ చైర్మెన్‌్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, సర్పంచ్ ఆకుల సునీత, తహశీల్దార్ గిరిధర్, ఎంపీడీఓ రాకేశ్‌రావు, ఏఓ ముత్యాల నాగరాజు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
పంతంగిలో కేంద్ర మంత్రి పర్యటన
కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ మండలంలోని పంతంగి గ్రామ పంచాయతీని సందర్శించారు. మంత్రిని గ్రామ సర్పంచ్ బాతరాజు సత్యం, పాలకవర్గ సభ్యులు పూలమాలలు, ,వివిధ పార్టీల నాయకులు మంత్రిని సన్మానించారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, కౌన్సిలర్లు బండమీది మల్లేశం, పోలోజు శ్రీధర్‌బాబు, ఆలె నాగరాజు, నాయకులు దూడల బిక్షంగౌడ్, దోనూరి వీరారెడ్డి, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, రిక్కల సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.