Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
స్త్రీ,శిశుసంక్షేమ శాఖ నిర్లక్ష్యం...ఐసీడీఎస్ అధికారుల అలసత్వం కారణంగా అనుముల ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్లు నూనె ప్యాకెట్ల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి శుక్రవారం దాపురించింది.అనుముల ప్రాజెక్టు పరిధిలో 255 అంగన్వాడీ కేంద్రాలు,పెద్దవూర మండ లంలో 72 ఈ కేంద్రాలకు గతంలో సెంటర్లకే నూనె,గుడ్లు,బాలామతం,పాలు,పప్పు ప్యాకెట్లు పంపేవారు.కానీ రెండునెలలుగా సెంటర్లకు నూనెప్యాకెట్లు పంపిణీ చేయడం లేదు. అయితే గతంలో కొద్దిరోజులు హాలియా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం నుంచి నూనెప్యాకెట్లు తెచ్చుకున్నారు.కానీ ఇప్పుడు సెంటర్లకు పంపించక ఆర్టీసీ కార్గో సర్వీసులో ఆయా మండలాలలోని స్టేజీల వద్ద, కూడళ్లలో, జాతీయ రహదారులపై కార్గో సర్వీసులు నిలిపివేస్తుండడం తో చలకుర్తి సెక్టార్ పరిధిలోని నాయిన వానికుంట, నాయిన వానికుంటతండా, చలకుర్తి, కుంకుడు చెట్టుతండా,తుంగతుర్తి, రామన్న గూడెం, రామన్నగూడెంతండా, ఏనేమీది తండా, పొట్టేవానితండా, చింతపల్లి, చింతపల్లితండా, తూర్పు పులా గూడెం, పడమటిపులాగూడెం, పర్వేదుల సెక్టార్ వాళ్లంతా తుమ్మచెట్టు స్టేజి వద్దకు, పెద్దవూర సెక్టార్ టీచర్లు పెద్దవూరకు పరుగులు పెట్టాల్సి వస్తుంది.లాక్డౌన్ కావడంతో ఆటోలు లేక తెలిసిన వారిని బతిమాలి ఎలాగో వాళ్ల వెహికల్ మీద అక్కడికి వస్తున్నారు.తీరా అక్కడికి వెళ్ళాక కార్గో సర్వీస్ రాకపోవడంతో వచ్చే దాకా ఉండి నూనెప్యాకెట్లను తీసుకెళ్తున్నారు.దీంతో అంగన్ వాడీ టీచర్లు రోడ్ల మీద నూనెకోసం పడిగాపులు కాస్తున్నారు. నూనె ప్యాకెట్లు తెచ్చు కోవాలంటే టీచర్ ,లేదా ఆయా వేలిముద్రలు పెడితేనే ప్యాకెట్లు ఇస్తున్నారు.దీంతో చాలా మంది కార్గో సర్వీసుల వద్దకు రావాలంటే 10 నుంచి 15 కిలోమిటర్ల దూరం రావాల్సి వస్తుంది.సూపర్వైజర్లు ముందుగా సరైన సమాచారం ఇవ్వక నూనె ప్యాకెట్లు తీసుకోక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది టీచర్లకు, ఆయాలకు కరోనాతో బాధ పడుతు న్నప్పటికీ నూనెప్యాకెట్ల కోసం కోసం రోడ్డెక్కారు.దీంతో కార్గో సర్వీసు వచ్చే వరకు రోడ్లపై పడిగాపులు కాయడంతో ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేజీ నూనెప్యాకెట్లు పంపించే వారు.కానీ ఇప్పుడు 200 గ్రాముల ప్యాకెట్లు పంపు తున్నారు.ఈసారైనా గతంలో మాదిరిగానే సెంటర్లకు గుడ్లు,పప్పు,పాల ప్యాకెట్లు ఎలా పంపిస్తున్నారో అలాగే నూనెప్యాకెట్లు కూడా సరఫరా చేయాలని అంగన్వాడీటీచర్లు కోరుతున్నారు.