Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
ప్రతి రైతూ వానా కాలంలో వేసిన తమ పంటల వివరాలను తప్పనిసరిగా వ్యవసాయ విస్తరణాధికారి వద్ద నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని బండరామారం గ్రామంలో వరి, కంది, మిర్చి, పత్తి పంటలను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం వర్షాలు తగ్గాక వరి పంటలో మురుగు నీరు తీసేయాలన్నారు. ప్రస్తుతం నత్రజని, ఎరువులను తాత్కాలికంగా ఆపేసి 19:19:19 4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలని కోరారు. పత్తి, కంది, మిర్చి పంటలకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల వల్ల వడ తెగులు, ఎండు తెగులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు జీఎంఎస్ లీటర్ నీటిలో కలిపి తెగులు సోకిన ప్రదేశంలో మొదలు తడిచేలా పోయాన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మనోహర్, సాయిశ్రీజన, లక్ష్మీ ప్రసన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.