Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ :ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తానికి సరిపడేంత చేప పిల్లల ఉత్పత్తికి కావాల్సిన సామర్ధ్యం ఉన్న తుమ్మడం,డిండి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలును కబ్జాల గురికావడం మత్స్యకారులకు చాలా అన్యాయమని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కేంద్రాలు కబ్జాల గురికాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకష్ణ డిమాండ్ చేశారు.శుక్రవారం సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా నల్లగొండ జిల్లా సంఘం అధ్యక్షులు కార్యదర్శులు గాలి నర్సింహ, మురారీమోహన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ వద్ద ఉన్న చేప పిల్లక్షేత్రాన్ని పర్యటించి పరిశీలించారు.రాష్ట్రంలోని అతిపెద్ద విస్తీర్ణం 72 ఎకరాల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నేడు 10 ఎకరాలు కబ్జా కాగా 62 ఎకరాల పరిమితమైందన్నారు.నేటికీ తుమ్మడం చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో కరెంట్ సౌకర్యం లేదన్నారు.సరైన నీళ్ల సౌకర్యం,పెన్సింగ్ లేవన్నారు.సరైన సిబ్బంది లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై చేప పిల్లల ప్రొడక్షన్ సరిగ్గా లేక ప్రొడక్షన్ చేపపిల్లల కేంద్రం మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్ల కాలంలో టెండర్ల ద్వారా చేప పిల్లల పంపిణీ పేరుతో రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నా 40 శాతం కూడా ఈ నిధుల నుంచి మత్స్యకారులకు లబ్ది చేకూరడం లేదన్నారు.టెండర్ల ద్వారా చేపపిల్లల పంపిణీ కాకుండా ప్రభుత్వం నేరుగా రాష్ట్రంలో ఉన్న 22 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు నిధులు కేటాయించడంతో సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సొసైటీలకు ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నుండి ఉచిత చేప పిల్లల పంపిణీ చేసే ఈ విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తుమ్మడం చేపపిల్లల విత్తన కేంద్రాన్ని అభివద్ధి పరచడానికి 62 ఎకరాల సువిశాల స్థలంలో ఉన్న ఏర్పాటు చేయాలని నీటి వసతి కోసం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చేప పిల్లల ఉత్పత్తికేంద్రానికి పెద్దబావి దానికి నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సిబ్బందిని 40 మందికి తగ్గకుండా మూడు జిల్లాలకు చేపపిల్లల ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందన్నారు.ఈ పర్యటనలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాలి నర్సింహ, మురారిమోహన్, మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు గోపగోని వెంకన్న, గువ్వల లక్ష్మయ్య, పల్లాఅశోక్, బోయిని మహేష్ పాల్గొన్నారు.