Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-దేవరకొండ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం దేవరకొండలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశాన్ని లూటీ చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవ హరిస్తుందని విమర్శించారు.ప్రభుత్వరంగ సంస్థ లను ప్రయివేటుపరం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం అడ్డూఅదుపూ లేకుండా పెంచు తుందన్నారు. దేశంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే విధంగా జర్నలిస్టులను, ప్రతిపక్ష నాయకులపై కేసులను నమోదు చేస్తూ జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు.కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేకచట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధుపథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, అర్హులైన పేదలకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు, మూడెకరాల భూమి పంపిణీ చేయాల న్నారు.పోడు భూములకు సంబంధించి రైతులకు హక్కుదారుల పత్రాలను ఇవ్వాలని కోరారు.విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు.ఈ నెల 4, 6వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.సలీం, మండల కార్యదర్శి కుంటిగోర్ల నాగరాజు, నల్ల వెంకటయ్య, బిజిలి లింగయ్య, శ్రీను, నిమ్మల పద్మ, రహీం, గుండాల ఆంజనేయులు, రామస్వామి, వెంకటేశ్ పాల్గొన్నారు.