Authorization
Mon Jan 19, 2015 06:51 pm
17 ఏండ్లుగా ఊరిస్తూ...
ఆగుతూ... సాగుతూ నత్తనడకన బ్రాహ్మణ వెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్టు
పూర్తికాని కుడి, ఎడమ కాలువల భూసేకరణ
ఇప్పటికి 73 శాతం పనులే పూర్తి..
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
లక్ష ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 2004 సెప్టెంబర్ 4న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి మండలపరిధిలోని బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో అట్టహాసంగా బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్టు నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు.2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు తొలుత రూ.699 కోట్లుగా అంచనా వేసి పరిపాలనా అనుమతి ఇచ్చారు.రూ.547కోట్లకు సాంకేతిక అనుమతి 2008లో పొంది 17 ఏండ్లుగా ఆగుతూ..సాగుతూ ఇప్పటికి 73శాతం పనులే పూర్తయ్యాయి.
ప్రాజెకు ప్రస్తు పరిస్థితి ఇలా...
ఉదయసముద్రం (పానగల్) రిజర్వాయర్ నుండి 6.900 కి.మీ. పొడవులో అప్రోచ్ కాలువ తవ్వకం పనులు, హెడ్‌రెగ్యులేటర్ పనులు పూర్తి కాగా, అప్రోచ్ కాలువ లైనింగ్పనులు నిర్మాణదశలో ఉన్నాయి.తదుపరి 6.900 కి.మీ.(పిట్టంపల్లి గ్రామం) నుండి 17.525 కి.మీ.(చౌడంపల్లి గ్రామం) మొత్తం 10.625 కి.మీ. పొడవు గల సొరంగంత్రవ్వకం పనులు పూర్తికాగా సొరంగం లైనింగ్ పనులు పూర్తి కావాల్సింది ఉంది. సొరంగం లైనింగ్ 8.62 కిలోమీటర్లు వరకు పూర్తైంది. ఇంకా 2 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సింది.సొరంగం చివరిభాగమైన 17.525 కి.మీ.(చౌడంపల్లి గ్రామం) వద్దగల పంప్‌హౌస్ తవ్వకం పనులు పూర్తికాగా, పంపుల నిర్మాణం, దానికి సంబంధించిన పనులన్ని పూర్తయ్యాయి.పంప్‌హౌస్ నుండి బ్రాహ్మణవెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు సుమారు 1.120 కి.మీ. పొడవులో వాలుసొరంగం, డెలివరీ మెయిన్స్పనులతో పాటు సిస్టర్న్ పనులు పూర్తయ్యాయి.బ్రాహ్మణవెల్లెంల గ్రామం వద్ద 0.302 టీఎంసీల సామర్ధ్యంతో 3.655 కి.మీ. పొడవులో నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులన్ని చివరదశలో ఉన్నాయి.రిజర్వాయర్ నుండి ప్రారంభంమయ్యే కుడి ఎడమ ప్రధాన కాలువలత్రవ్వకం పనులు చురుకుగా సాగుతున్నాయి. 6.500 కి.మీ. పొడవుగల ఎడమ ప్రధానకాలువ కింద 43,000 ఎకరాలకు, 25.530 కి.మీ. పొడవుగల కుడి ప్రధాన కాలువ కింద 57,000 ఎకరాలకు సాగు నీరందించడానికి అవసరమైన డిస్ట్రిబ్యూటరీ, మైనర్, సబ్‌మైనర్ నెట్వర్క్ పనులు జరుగుతున్నాయి.
ఇంకా పూర్తికాని కుడి,ఎడమ కాలువల భూసేకరణ..
కుడి,ఎడమ కాలువల కోసం 3,851 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండగా నేటికీ కి 1,456 ఎకరాలు మాత్రమే సేకరించారు.ఇంకా 3,851 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. భూసేకరణలో జాప్యం ఈ పథకం ప్రధానసమస్యగా మారింది.ఈ స్కీమ్ యొక్క మొత్తం ఆయకట్టు 1,00,000 ఎకరాల ఆయకట్టుకు అవసరమైన భూసేకరణ మొత్తం 3,851 ఎకరాలకుగాను నేటికి1456 ఎకరాలు సేకరించారు.మరో 2395 ఎకరాల సేకరణ వివిధ దశలలో కొనసాగుతున్నది.ఇందులో కుడి కాలువ 1898 ఏకరాలకి గాను 254 ఎకరాలు సేకరించారు.ఎడమకాలువ పనులకు 1080 ఏకరాలకు 269 ఎకరాలు సేకరించారు.ప్రధాన ఎడమ కాలువత్రవ్వకపు పనులలు 57.32 శాతం, ప్రధాన కుడికాలువ తవ్వకపుపనులు 18.54 శాతం,సొరంగంపనులు(6.900-17.525) 44.53 శాతం, అప్రోచ్ కాలువ తవ్వకపుపనులు-100 శాతం, సర్జ్‌పూల్ పనులు-93శాతం, పంప్‌హౌస్, సంబంధిత పనులు 95శాతం, ప్రెస్సర్మెయిన్ పనులు 99.99 శాతం, డెలివరీ సిస్టర్న్100శాతం మొత్తంగా 71శాతం పనులు పూర్తయ్యాయి.
లక్ష ఎకరాలకు సాగునీరు ఇలా..
బ్రాహ్మణవెల్లెంల గ్రామం వద్ద 0.302టీఎంసీల సామర్ధ్యంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏఎమ్మార్, ఎస్సెల్బీసీ ప్రాజెక్టు యొక్క ప్రధాన కాలువకు ఎగువ భాగాన మునుగోడు (10,270 ఎకరాలు), నల్లగొండ (24,469 ఎకరాలు),నకిరేకల్ (62,477 ఎకరాలు) తుంగతుర్తి (2,784 ఎకరాలు) శాసనసభ నియోజకవర్గాలలో గల మునుగోడు (10,270 ఎకరాలు),నల్లగొండ (24,469ఎకరాలు), నార్కట్‌పల్లి (33,773 ఎకరాలు), చిట్యాల (5,595 ఎకరాలు), రామన్నపేట (2,496 ఎకరాలు), శాలి గౌరారం (2,784 ఎకరాలు),కట్టంగూరు (20,614ఎకరాలు) మండ లాలలో 107 గ్రామాలకు తాగునీటితో పాటు ఒక లక్షఎకరాలకు సాగునీటిని అందించే ప్రధాన ఉద్దేశంతో ఉదయసముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్-2008లో ప్రారంభించారు.
ప్రాజెక్టుకు నిధులు మంజూరు ఇలా...
2008లో పనులు ప్రారంభించిన ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు అంచనా విలువను జీఓ ఎంఎస్ నెం:143,13.06.2007 ప్రకారం ప్రభుత్వం నుండి పరిపాలన అనుమతులు పొందిన పథకాన్ని రూ. 561.96 కోట్లతో పూర్తి చేయుటకు హైదరాబాద్‌కు చెందిన మైటాస్ ,మెయిల్ , కేబీఎల్జేవి అనే సంస్థలతో ఒప్పందం +.ఉ. =ు చీశీ. 357ట×తీతీఱస్త్రa్‌ఱశీఅ డ జAణ (ూతీశీjవష్ర-×) ణవజూaత్ీఎవఅ్), ణa్వ: 25.05.2015 సాంకేతిక,ఆర్ధిక అంశాల సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకొని 3 ఆఫ్‌లైన్ రిజర్వాయర్లను తొలగించిన తర్వాత, +.ఉ.వీూ చీశీ. 159 (ట×తీతీఱస్త్రa్ఱశీఅడజAణ (ూతీశీjవష్ర-×) ణవజూaత్ీఎవఅ్, 04.12.2015 సవరించిన అంచనా రూ. 518.11 కోట్లు, అనుబంధఒప్పందం 2ూజు/2016-17, 01.07. 2016 , అగ్రిమెంట్ మొత్తం రూ.483. 944 కోట్లు జరిగింది.అగ్రిమెంట్ మొత్తం 483.944 కోట్ల రూపాయలు కాగా గత ప్రభుత్వకాలంలో 2014 వరకు రూ.195.55 కోట్ల పనులు కాగా ఈ ప్రభుత్వకాలంలో 2014 నుండి నేటి వరకు రూ.145.01 కోట్లు పనులతో మొత్తం 03.09.2021 నాటికి రూ.340.56 కోట్లపనులు (71శాతం) పూర్తి చేయగా మిగిలినపనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుండి 31.03.2022 వరకు ఈఓటీ అనుమతులు పొందారు.బ్రాహ్మణవెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోనికి ఎత్తిపోసి, నల్లగొండ, నార్కట్‌పల్లి,చిట్యాల, మునుగోడు, రామన్నపేట, శాలిగౌరారం,కట్టంగూరు మండ లాలలో 107 గ్రామాలకు తాగునీటితో పాటు ఒక లక్ష ఎకరాలకు సాగు నీరందుతుంది.సవరించిన అంచనా విలువ ప్రకారం రూ.678.35 కోట్ల పనులు పూర్తి చేసేందుకు, భూసేకరణకు దాదాపుగా రూ.168 కోట్లు అవుతాయని,సవరించిన అంచనా విలువ ప్రకారం రూ.678.35 కోట్లు పను లు పూర్తి చేసేందుకు, భూసేకరణకి దాదాపుగా రూ.168 కోట్లు అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు
ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యమిలా..
ఉదయసముద్రం ప్రాజెక్టు పనులు-2008లో ప్రారంభించబడి, తొలుత అన్ని విభాగాలలో పనులు త్వరితగతిన జరిగినప్పటికీ, అక్టోబర్ 2013 అనుకోని వరదల వల్ల సొరంగం, సర్జికల్పూల్, పంపుహౌజ్ మునిగి పోవడం వల్ల తదుపరి పనులు నెమ్మదిగా జరిగాయి.వాల్టా చట్టం 2007 ఇసుక సేకరణ ఆంక్షలు విధించడం, భూసేకరణచట్టం 2013 కారణంగా పనులు చేయడంలో జాప్య మైంది.ప్రస్తుతం,సొరంగం, పంపు హౌజ్, డెలివరీ మిషన్ సబ్‌స్టేషన్ పనులు బ్రాహ్మణవెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తయ్యాయి.సొరంగం లైనింగ్పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. త్వరితగతినప్రాజెక్టును ప్రారంభి ంచడానికి అన్ని చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.