Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలో రహదారి అభివద్ధి పనుల కోసం 2021-22 వార్షిక ప్రణాళికలో భాగంగా రూ.90 కోట్లను కేటాయించాలని ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎ. గిరిధర్‌ను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అభ్యర్థించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో పాటు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన గిరిధర్‌రావును ఢిల్లీలోని కార్యాలయంలో ఎమ్మెల్యే కలిశారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 157.707 అలీనగర్ నుంచి 187.723 మిర్యాలగూడ వరకూ ఎన్ హెచ్-167 నిర్మాణం కోసం రూ.220.28 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు.దీనిలో 182.750 కిలోమీటర్ల నుంచి 187.723 కిలో మీటర్ల పొడవు రహదారిలో (ఎన్ హెచ్-167) జనాభా అధికంగా ఉన్న మిర్యాలగూడ పట్టణం పరిధిలో ఉన్నదన్నారు.ఈ ప్రాంతంలో గతంలో ప్రతిపాదించిన ప్రతిపాదనలతో పాటు, ప్రజల సౌలభ్యం కోసం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వీలుగా సైడ్డ్రైన్లు, పాదచారుల కోసం ప్రత్యేక ఏర్పాటు, నాలుగులైన్ల ప్రత్యేక ఏర్పాటు కోసం రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలని అభ్యర్థించారు.ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎ. గిరిధర్‌రావుకు అభ్యర్ధనపత్రాన్ని అందజేశారు.దీనిలో ఆర్అండ్బీ ఈఎన్సీ ప్రతిపాదన గురించి కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు.మిర్యాలగూడ పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే, ట్రాఫిక్ రద్దీని నియంత్రించాలంటే తమ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసి నిధులు మంజూరు చేయాలన్న ఎమ్మెల్యే అభ్యర్థనపై గిరిధర్‌రావు సానుకూలంగా స్పందించారు.