Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
మండలంలోని ఐదు గ్రామాలను ఎంచుకొని ఐదు రైతు వేదికలను నిర్మించారు మూడింటిని ప్రారంభించారు. ఇంకా రెండు రైతు వేదికలు నిర్మాణం పూర్తి అయినప్పటికీ ప్రారంభించడంలేదు. ఒక్కొక్క రైతు వేదికకు ప్రభుత్వం 22 లక్షలతో నిర్మించారు. రైతులకు సలహాలు సూచనలు అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండడానికి వీలుగా రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గొలనుకొండ, గుండ్లగూడెం గ్రామాల్లో రైతు వేదికలను నిర్మించారు కానీ వాటిని ప్రారంభించడానికి ప్రజా ప్రతినిధులకు ,అధికారులకు ముహూర్తాలు కుదరడంలేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
నాణ్యత లోపం ఉందా
2020 దసరా నాటికి రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించడంతో హడావుడిగా నిర్మాణాలు పూర్తి చేశారు.హడావుడిగా నిర్మాణం చేపట్టడంతో నాణ్యత లోపం చోటుచేసుకుందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు .నిర్మాణానికి సరిపడా ఇసుక, సిమెంట్ , కంకర నాణ్యతా లోపం ఉంటుందని పలువురు అంటున్నారు. ప్రభుత్వానికి రైతు సంక్షేమం పై చిత్తశుద్ధి ఉంటే రైతులకు ముందుగా పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇంకా ఎప్పుడు ప్రారంభిస్తారు
జూకంటి పౌల్, గుండ్లగుడం
రైతు వేదికలను నిర్మించి ఇంకా ప్రారంభించలేదు. రైతులకు సలహాలు సూచనలు ఎప్పుడు ఇస్తారు .
హడావుడిగా నిర్మాంచారు
ఎంపీటీసీ బత్తుల నరేందర్ రెడ్డి
సీఎం కేసీఆర్ రైతు వేదికలను త్వరితగతిన నిర్మించాలని ఆదేశం ఇవ్వడంతో వారు హడావుడిగా నిర్మించారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు దష్టిలో ఉంచుకొని రైతు వేదికలను పరిశీలించి వాటిని వెంటనే ప్రారంభించాలి.