Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
గర్భిణీ బాలింతలకు పోషక విలువలు కల ఆహారమే ప్రధానమని ఐసీడీఎస్ నకిరేకల్ ప్రాజెక్టు సీడీపీఓ రత్నమ్మ పేర్కొన్నారు.శుక్రవారం మండలపరిధిలోని అక్కెనపల్లి ఐసీడీఎస్ సక్టార్ మీటింగ్‌ను పోతినేనిపల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ మాసంలో కచ్ఛితంగా అందరు 0-6 ఏండ్ల పిల్లలకు,గర్భిణులకు,బాలింతలకు బరువులు తీసి పోషణట్రాకర్లో అప్డేట్ చేయాలని సూచించారు.ప్రతి అంగన్వాడీకేంద్రంలో పోషణమాసం కార్యక్రమాలు చేయాలని, ప్రజలలో పోషణ పద్ధతులపై అవగాహన, పెరటితోటలపెంపకం గురించి తెలియ జేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ సాగర్ , సూపర్వైజరు ఫరీదాభేగం, అంగన్వాడీ టీచర్లు శంకరమ్మ, యాదమ్మ, కరుణ, ప్రభావతి, లక్ష్మీ, సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.అదేవిధంగా ఐసీడీఎస్ నార్కట్ పల్లి సెక్టార్లో జరిగిన మీటింగ్‌లో సమావేశంలో సూపర్వైజరు కళావతి, అంగన్వాడీ టీచర్లు లక్ష్మీ, సునీత, ఉమా, నిర్మల పాల్గొన్నారు.