Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
నిరుద్యోగులకు ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కవిడే సురేష్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆదివారం మండల పరిధిలోని జాలు కాలువ గ్రామంలో డీివైఎఫ్ఐ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీల అన్నింటిని విస్మరించిన ట్లు తెలిపారు. కేంద్రం ఏటా కోటీ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 3016 నిరుద్యోగ భతి ఇస్తానన్న మాట ఎన్నికల మాటగా మారిందన్నారు .అనంతరం నూతన గ్రామ శాఖ ఏర్పాటు చేశారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా పోతూ అశోక్ ప్రధాన కార్యదర్శిగా రాబోతూ నవీన్ ఉపాధ్యక్షులుగా బొడ్డు వంశీ మాజీ డీవైఎఫ్ఐ నాయకులు రాజయ్య సురేందర్ రాజు సుందరయ్య అశోక్ తదితరులు పాల్గొన్నారు.