Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
ఉపాధ్యాయులు సమాజ మార్గ నిర్దేశకులు అని, సమాజానికి ఉత్తమ పౌరులను అందించేది ఉపాధ్యాయులేనని మోత్కూర్ మార్కెట్ చైర్మెన్్ కొణతం యాకూబ్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్య వైశ్య భవన్లో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మండల ఉపాధ్యాయులు పసునూరి కష్ణ, గంధం శ్రీనివాస రావు, కట్కూరి అరుణాదేవి, గుండా మల్లేషం, దుస్సా పరమేశ్వరిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎదుల్ల సుధీర్ రెడ్డి, కోశాధికారి సోమ వెంకటేశ్వర్లు, సభ్యులు పైళ్ల సోమిరెడ్డి, గనగాని నర్సింహ, కరుణాకర్ రెడ్డి, కారుపోతుల వెంకన్న, సూదగాని పాండు, పొన్నబోయిన రమేష్, ఎస్ఎన్.చారి, మొగుళ్ళపల్లి సోమయ్య, గాదె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : గురుపూజోత్సవం సందర్భంగా దినోత్సవ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బ్రహ్మ చారి, మండల ప్రైవేటు ఉపాధ్యాయుల అధ్యక్షుడు నర్రభిక్షం రెడ్డి లకు కౌన్సిలర్ బెల్లి సత్తయ్య సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సింగిల్విండో డైరెక్టర్ జగిని బిక్షం రెడ్డి, యంజి యూత్ అధ్యక్షులు తూర్పునూరి మల్లేష్ ,నర్రా బిక్షం రెడ్డి ,చింతపెల్లి బిక్షం కాలనీ విద్యార్థులు పాల్గొన్నారు.
గురుపూజోత్సవం సందర్భంగా పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి శిలా రాజయ్య ఆధ్వర్యంలో విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పామనగుళ్ళ అచ్చాలు,పెద్దులు బండారు జనార్ధన్ మరియు విశ్రాంత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ : ఉపాధ్యాయులు,భారత దేశపు రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయుడు,ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్ నాయక్ తన స్వగహంలో కుటుంబ సభ్యులతో కలసి డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జశ్వంత్ కుమార్, సాయి తేజ, ముఖేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .