Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి అన్నారు. జర్నలిస్టు డేను పురస్కరించుకుని మోత్కూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్యవైశ్య భవన్లో జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులుగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కషి చేస్తున్నారని, సమాజాభివద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి ఎదుళ్ల సుధీర్ రెడ్డి, కోశాధికారి సోమ వెంకటేశ్వర్లు, ప్రతినిధులు పైళ్ల సోమిరెడ్డి, గనగాని నర్సింహ, కరుణాకర్ రెడ్డి, కారుపోతుల వెంకన్న, మొగుళ్లపల్లి సోమయ్య, గాదె వెంకటేశ్వర్లు, ఎస్ఎన్. చారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, టీడీపీ మండల అధ్యక్షుడు సూదగాని పాండు, గంధంశ్రీనివాసరావు, పి.సుధాకర్, వి.ప్రవీణ్ కుమార్, ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు పాల్గొన్నారు.