Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
సామాజికవిలువలు, నైతిక విలువలు పెంపొందించడంలో ఉపాధ్యాయుడు దేశానికి మార్గదర్శకంగా ఉంటాడని సామాజికవేత్త రాజరత్నం అన్నారు.సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక మిర్యాలగూడలోని గ్రంథాలయంలో సర్వేపల్లి రాధాకష్ణ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ లక్ష్మీనర్సింహారెడ్డి, నాగమణి, కార్తీక్, రాకేష్, రీడర్స్ తదితరులు పాల్గొన్నారు.
అవంతీపురంలో..ఉత్తమ పౌరసమాజాన్ని నిర్మించటంలో ఉపాధ్యాయుల పాత్ర అనిర్వచనీయమని గిరిజన బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో సర్వేపల్లి రాధకష్ణకు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్ర్రమంలో ప్రిన్సిపాల్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ అజయ కుమార్, రాజారత్నం, ముజీబ్, పుష్ప, వరలక్ష్మి, మంగయ్య, నాగయ్య, సుదర్శన్, జానకి రాములు, సికిందర్, రోషయ్య, రమేష్ పాల్గొన్నారు.
దేవరకొండ:డాక్టర్ సర్వేపల్లి రాదాకష్ణ జన్మదినమైన గురుపూజోత్సవాన్ని పురస్కరిం చుకొని లయన్స్ క్లబ్ మిత్ర అధ్యక్షులు పగిడిమర్రి రఘురాములు ఆధ్వర్యంలో దేవరకొండలోని వివిధ ప్రయివేట్పాఠశాలలోని 17 మంది ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి నెలకు రూ.2 వేల విలువ గల నిత్యావసరాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పగిడిమర్రి రఘురాములు,జోనల్ చైర్మెన్ డాక్టర్ పీజే.శ్యాంసన్, డీసీ మాదిరెడ్డి సంధ్యారెడ్డి, ప్రధానకార్యదర్శి చిలువేరు శ్రీనివాసులు, కోశాధికారి బోడ నిరంజన్, సభ్యులు చెరిపల్లి యల్లయ్య, బాలరాజు, పగిడిమర్రి సత్యమూర్తి, ఏరువ కష్ణయ్య, మాకం మహేష్, కర్నాటి శ్రీనివాసులు, చిలుకూరి వెంకటేశ్వర్లు, జూలూరి జ్యోతిబసు, పులిజాల శ్రీనివాసులు, జబ్బు అంజిబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం దేవరకొండ సేవా సదనం నందు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకష్ణన్ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అంకం చంద్రమౌళి, కోశాధికారి పంగునూరి లింగయ్య, ఉపాధ్యక్షులు వనం బుచ్చయ్య, యూసుఫ్ షరీఫ్, జిల్లా ఉపా ధ్యక్షులు కంచర్ల నారాయణరెడ్డి, జంపాల యాదగిరి, బలుసాని సత్యనారాయణ, జోజప్ప పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ : తిరుమలగిరి మండలకేంద్రంలోని జమ్మన్నకోట గ్రామంలో టీచర్స్‌డేను ఆదివారం ఘనంగా నిర్వహించారు.సీఆర్పీఎఫ్ జవాన్ లక్ష్యానాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ లక్ష్మణ్‌నాయక్,భాస్కర్లను శాలు వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, పెన్సీలు, గురుకుల్లాల్లో సీటు పొందిన విద్యార్థులకు ప్రత్యేకంగా గుర్తించి ఆదుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవినాయక్, ఉపసర్పంచ్ మునినాయక్, గ్రామపెద్దలు మెగ్యానాయక్, శివ, నాగరాజు, శ్రీను పాల్గొన్నారు.