Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహాంగీర్
నవతెలంగాణ -మోటకొండూర్
నేడు జిల్లావ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా మండల కేంద్రాల్లో జరుగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శి ఎండి.జహంగీర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆ పార్టీ మండల ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లో ఉన్న కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నాడని విమర్శించారు. వ్యవసాయ రంగంలోకి నూతన చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దానివల్ల కార్మికులు, రైతులు దేశవ్యాప్తంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో దేశంలోని ప్రజలకు దీపాలు వెలిగించాలని, చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారన్నారు. కరోనా మహమ్మారిని సమర్థ వంతంగా ఎదుర్కొనే వైద్య రంగాన్ని అభివద్ధి పరచలేక పోయారని విమర్శించారు. లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో రూ.లక్షా 60 వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకు లాభంచేకూర్చేవిధంగా చేశారు తప్ప పేద ప్రజలకు రైతులకు వ్యవసాయ కూలీలకు వలస కూలీల ఎలాంటి ప్రయోజనం చేకూర్చే లేదని ఎద్దేవా చేశారు. నేడు జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ పాల్గొన్నారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు.
సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా బొలగాని జయరాములు
మండల కమిటీ సభ్యులు గా కొల్లూరు అంజనేయులు, బొగా రమేష్, కొల్లూరు సుధాకర్, చిన్నబత్తిని రోమన్, కొల్లూరు నాగరాజు, బాల విజయలక్ష్మి, కొల్లూరి సరిత, కోమ్మగాని దశరథ, దుంప సుదర్శన్, బైరపాక సర్వయ్య, కాల్యా గోపాల్, తుమ్మల మల్లేశం ఎన్నికయ్యారు. ఈమహాసభలో మండలంలోని శాఖా కార్యదర్శులు పార్టీ సభ్యులు సీనియర్ నాయకులు బాల్డ యాదగిరి, కొల్లూరు మహేందర్, పోతుగంటి బిక్షపతి, కొల్లూరు బిక్షపతి, కొల్లూరు నగేష్, బందెల పోచయ్య, బందెల సిద్ధయ్య, కాంబోజు యాదయ్య, కాలియా విజరు, ఆదెపు సోములు, భైరపాక ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.