Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సంస్థాన్‌నారాయణపురం
తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను, అధ్యాపకులను ప్రాణం ఉన్నంత వరకుమరువలేమని సర్వేలు గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సమాఖ్య అల్యూమినియం సొసైటీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మల్లేశం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలంలోని సర్వేల్ గ్రామంలో గల తెలంగాణ గురుకుల పాఠశాల లో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.1971లో సర్వేల్ గ్రామంలో గురుకుల పాఠశాల ఏర్పాటు అయింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గురుకుల పాఠశాలలో అధ్యాపకులుగా పని చేసిన అధ్యాపకులను సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి దినకర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తాము ఈ ఉన్నత స్థాయికి ఎదగడానికి సర్వేల్ గురుకుల పాఠశాల, అందులో విద్యా బోధన చేసిన అధ్యాపకులే ప్రధాన కారణమన్నారు.పాఠశాల అభివద్ధికి పూర్వ విద్యార్థుల సమాఖ్య ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అల్యూమినియం అసోసియేషన్ కార్యదర్శి వివేకానంద, పూర్వ విద్యార్థి రాష్ట్రపతి అవార్డు గ్రహీత దేవరకొండ సంపత్ కుమార్ ఆచారి , తదితరులు పాల్గొన్నారు.