Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
అధ్యాపకులుగా తాము ఎంతో శ్రద్ధ తీసుకున్నప్పటికినీ విద్యార్థుల ఎదుగుదల విద్యాభివద్ధి పరిపూర్ణం కావాలంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ తోడ్పాటు చాలా కీలకమైందని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డా.బెల్లి యాదయ్య అన్నారు. స్థానిక డిగ్రీ కళాశాల గోష్ఠీమందిరంలో ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కష్టనష్టాలకోర్చి తమ పిల్లలను డిగ్రీ విద్యకోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటను ఎంపికచేసుకొని చదివిస్తున్న తల్లిదండ్రుల కలల సాకారానికి కళాశాల వైపునుంచి శక్తివంచన లేకుండా కషిచేస్తామన్నారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ చక్కని ప్రశాంతమైన వాతావరణంతో పాటు ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు అన్నివిధాల సామర్థ్యాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట కళాశాల అందిన్నందున్నే పిల్లలను చేర్పించామన్నారు. కళాశాల అభివద్ధికి అన్నిరకాలుగా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ కన్వీనర్ మక్లా, సభ్యులు పీర్ సాహెబ్, డా.బ్రహ్మం, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఏఓ మంజర్ జాఫ్రి, అధ్యాపకులు తుల్జాభవాని, కార్యాలయ సిబ్బంది వెంకన్న, భాస్కర్, జ్యోతి విద్యార్థినీవిద్యార్థులు, తల్లిదండ్రులు శ్రీనివాస్, రామకష్ణ, ఇబ్రహీం, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.