Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్ని వార్డుల్లోనూ అభివద్ధి పనులు వేగవంతం
ఎమ్మెల్యే నల్లమోతుభాస్కర్రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
నియోజకవర్గంలో చేపడుతున్న అభివద్ధి పనులను వేగవంతం చేశామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.పట్టణ ప్రగతి పనుల్లో ముందుండటంతో పాటు పారదర్శకతకు పెద్దపీట వేసినట్టు చెప్పారు.మిర్యాలగూడ పట్టణంలోని 22వ వార్డు హనుమాన్ పేటలో రూ.20 లక్షల నిధులతో చేపట్టనున్నసీసీ, డ్రెయినేజీ నిర్మాణం పనులకు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్తో కలిసి ఎమ్మెల్యే ఆదివారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. పట్టణాభివద్ధిలో పార్టీలకఅతీతంగా అందరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం పనులను చేపడుతున్నట్టు తెలిపారు. అంతే కాకుండా, 15వ ఆర్ధిక సంఘం నుంచి మంజూరైన రూ.2కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు,డ్రయినేజీనిర్మాణ పనులను వేగవంతం చేసినట్టు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో 7వేల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చేందుకు నిధులు మంజూరు చేయిం చినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మెన్ కుర్రవిష్ణు, కౌన్సిలర్లు చిలుకూరి రమాదేవిశ్యామ్, చీదళ్లవెంకటేశ్వర్లు, సుబ్బారావు, కాంట్రాక్టర్లు, స్థానికనేతలు, పాల్గొన్నారు.