Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్,సీడీఎంఏ హైదరాబాద్ వారి ఆదేశానుసారం మున్సిపాలిటీలోని వివిధ వార్డులల్లో మురుగు నీరునిల్వ ఉండకుండా వాటిని తొలగిస్తూ దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని చైర్పర్సన్ పోతరాజు రజిని రాజశేఖర్ అన్నారు.ఆదివారం మున్సి పాలిటీలోని వివిధ వార్డుల్లో రోడ్ల వెంట, బజార్లోని ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఫ్లెక్సీలను అమార్చమని చెప్పారు.మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకొని ప్రజలకు తగు సూచనలు ఇచ్చామని చెప్పారు.నీళ్లు నిలిచిన చోట బ్లీచింగ్ఫౌడర్, ఆయిల్ బాల్స్ వేశామని చెప్పారు.వర్షాకాల సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తుగానే వీధుల్లోని నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసు కుంటు న్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ దండు శ్రీను,శానిటరి ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, జూనియర్ అసిస్టెంట్ ఖధీర్, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.