Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లునాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈనెల6న నిర్వహించనున్న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి కోరారు.శనివారం పార్టీ జిల్లా సెంటర్,సూర్యాపేట నియోజకవర్గ మండల కార్యదర్శుల సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన ఎంవీఎన్ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెట్రోల్, డీజిల్,గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల భారాలు మోపుతూ ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తుందన్నారు.దేశ సంపదను కొల్లగొడుతూ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పేవిధానాలను విడ నాడాల న్నారు.దేశంలో ఉన్న ప్రజల మీద కన్నా పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల మీదనే మోడీకి ప్రేమ ఉందన్నారు.రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలని, కార్మిక లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని పోరాడుతున్న ఉద్యమాలను సైతం అవహేళన చేసే విధంగా మోడీ పాలన కొనసాగిస్తున్నాడన్నారు.అనేక మంది పేదలకు ఇండ్లు, స్థలాలు, రేషన్‌కార్డులు, పెన్షన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు,పింఛన్లు ఇస్తామని పేపర్లలో ప్రకటనలకే పరిమితం తప్ప ఆచరణలో ప్రభుత్వం ఎక్కడా అమలు చేయడం లేదన్నారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు,జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి, ఎల్గూరి గోవింద్, దండా వెంకట్‌రెడ్డి, చెరుకు యాకలక్ష్మీ, నాయకులు కొప్పుల రజిత, చిన్నంగారి నర్సయ్య, బోళ్ళ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.