Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపాలిటీలో అకాల వర్షాలకు వరద నీరు ఉధతి నుండి పట్టణ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకష్ణ, సహాయకార్యదర్శి ఎమ్‌డి.ఖయ్యుమ్ డిమాండ్‌చేశారు. సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో డీవైఎఫ్ఐ బందం పర్యటించి ప్రజల పరిస్థితిని అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా మధుకష్ణ, ఖయ్యుమ్ మాట్లాడుతూ వరద ఉధతిగా వచ్చినప్పుడు అధికార యంత్రాంగంలో కదలికలు వస్తున్నాయని, ముందు ప్రణాళికలు చేసి వరద నుండి మున్సిపాలిటీ ప్రజలను కాపాడడంలో పూర్తిగా విఫలమవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మున్సిపాలిటీ అధ్యక్షులు దేప రాజు, నాయకులు బొడిగె సైదులు, సాతిరి మనోజ్, బలరామ్‌రెడ్డి, యానాల రాజశేఖర్‌రెడ్డి, మలిగె లింగస్వామి, రవి, ఎమ్‌డి.ఖాసీమ్, గంట శంకర్‌రెడ్డి, మురళి, వంశీ, లింగస్వామి, ప్రవీణ్, సురేశ్ పాల్గొన్నారు.