Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నసింహ ప్రాజెక్టుకు వరద నీరు
అ విస్తరిస్తున్న విష జ్వరాలు
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసాయి. ఉపరితల ఆవర్తనం తో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల్లో, కాలువల్లో నీరు వచ్చి చేరుతుంది. నసింహ (బస్వపురం) రిజర్వాయర్ ప్రాజెక్టు కు వరద నీరు కాలువల ద్వారా పెద్ద ఎత్తున వస్తుంది. దీనిని చూడడానికి ప్రజలు వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ తోపాటు రోడ్లు జలమయమయ్యాయి.
జిల్లా లో వర్షపాతం .
తుర్కపల్లి 4.5 మిల్లీమీటర్లు రాజాపేట 8.2, ఆలేరు 8.1, మోటకొండూరు 10.0, యాదగిరిగుట్ట 6.5, భువనగిరి 7.5, బొమ్మలరామారం 4.5, బీబీనగర్ 4.0, పోచంపల్లి 2.3, చౌటుప్పల్ 2.9, సంస్థాన్ నారాయణపూర్ 3.9, రామన్నపేట 4.6, వలిగొండ 6.0, ఆత్మకూరు 11.0, మోత్కూరు 11.6, అడ్డగూడూరు 13.3 గుండాల 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
విష జ్వరాలు.
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలకు విషజ్రాలు అడ్డుకుంటున్నాయి ముఖ్యంగా చిన్నారులకు జలుబు, దగ్గు, జ్వరాలు, విరోచనాలు వస్తున్నాయి. విష జ్వరాలతో యాదాద్రి భువనగిరి జిల్లా లోని వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాలు, రావడంతో కరోనా భయం పట్టిపీడిస్తోంది. వ్యాధుల బారినపడ్డ పిల్లలను పాఠశాలల యాజమాన్యాలు ఇంటి వద్దనే ఉండాలని సూచనలు చేస్తున్నారు. దీంతో 20 శాతం కూడా విద్యార్థుల హాజరు శాతం నమోదు కావడం లేదని సమాచారం.
ఆలేరురూరల్ : మండలంలోని గొలనుకొండ గ్రామ సమీపంలో ఉన్న పెద్ద వాగు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు ఉధతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది . ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లాలంటే ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా రెండు రోజులు ఇలాగే వర్షం పడితే పెద్ద వాగుపై నిర్మించిన బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంది.