Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్
నవతెలంగాణ -నార్కట్పల్లి
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పీఆర్టీయూ లక్ష్యమని మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ పేర్కొన్నారు, సోమవారం సాయంత్రం స్థానిక గుత్తా సుఖేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఆ సంఘం మండల సర్వసభ్య సమావేశం, మండల నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో కో విడ్ నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు సుంకరీ బిక్షం గౌడ్, కార్యదర్శి నిరంజన్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఓరుగంటి శ్రీనివాస్ రాష్ట్ర బాధ్యులు విజయనగరం శ్రీనివాస్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి మండల అధ్యక్ష కార్యదర్శులు సూది రెడ్డి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చిక్కుల్ల మధ నయ్య బసి రెడ్డి రవీందర్ రెడ్డి, సామ రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డి, మని రాజు, తదితరులు పాల్గొన్నారు
నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షునిగా సూది రెడ్డి రవీందర్ రెడ్డి, కార్యదర్శిగా చిక్కుల్ల మద్ద నయ్య , అసోసియేట్ అధ్యక్షులుగా బొజ్జ అంజయ్య, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర్, కార్యదర్శి గా గంగాధర్, మహిళా ఉపాధ్యక్షులుగా కవిత , మహిళా కార్యదర్శి వి రాధాకుమారి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.