Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీ కెప్టెన్ ఉత్తమ్
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్రవ్యాప్తంగా దళిత బందును అమలు చేయాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల జనాభా 64 లక్షలు అంటే సుమారుగా లక్ష 15 వేల కుటుంబాలుఉ నాయని ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున అంటే 1లక్ష 75వేల కోట్ల రూపాయలు వెంటనే కేటాయించాలన్నారు. ఇంత పెద్ద పథకాన్ని ఎలాంటి విధివిధానాలు లేకుండా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ది పొందడానికి పైలెట్ ప్రాజెక్టు అంటూ హడావుడిగా ప్రారంభించారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత ఈ పథకాన్ని కొనసాగిస్తారని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. ప్రతి పేదవానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, గత ప్రభుత్వం సక్రమంగా అమలు చేసిన ఇందిరమ్మ ఇంటి పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. తన పార్లమెంటు పరిధిలోని ఓ రేషన్ షాపును సందర్శించి డీలర్, వినియోగదారులతో మాట్లాడానన్నారు. పేదలకు రేషన్ ద్వారా ప్రభుత్వం అందించే నాసిరకం బియ్యం విషయం పై పార్లమెంటులో లేవనెత్తుతానని అన్నారు.ఈ కార్యక్రమంలో నల్గొండ డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, పీసీసీ అధికార ప్రతినిధి కైలాష్ నేత, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, డీసీసీ అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్,సైదులు గౌడ్, వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, ఎంపీటీసి చింత గిరి, కాంగ్రెస్ నాయకులు అల్లి సుభాష్,జానకిరాములు, ఖలీల్,సమద్, బొజ్జ శంకర్.. ప్రజాప్రతినిధులు ఎస్సీసెల్, మహిళా కాంగ్రెస్,యూత్ కాంగ్రెస్,ఎన్ఎస్యూఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.